Naga Babu: అన్నయ్యా... మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు: నాగబాబు

Naga Babus MLC Oath Ceremony Chiranjeevis Heartfelt Congratulatory Message

  • ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కొణిదెల నాగబాబు
  • సోషల్ మీడియా వేదికగా నాగబాబుకు అభినందనలు తెలిపిన సోదరుడు చిరంజీవి
  • అన్నయ్య ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలియజేసిన నాగబాబు

జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు బుధవారం ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబుకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు.

"ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడు (ఎమ్మెల్సీ)గా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు. ఆశీస్సులతో అన్నయ్య, వదిన" అని చిరంజీవి  ఎక్స్‌లో (ట్విట్టర్)లో రాసుకొచ్చారు. ఈ ట్వీట్‌కు నాగబాబుతో తాను, తన అర్ధాంగి కలిసి దిగిన ఫోటోలను చిరంజీవి జత చేశారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

మరోవైపు అన్న చిరంజీవి పోస్టుకు నాగబాబు స్పందిస్తూ.. "అన్నయ్యా.. మీ ప్రేమ, మద్దతుకు కృతజ్ఞుడిని. మీరు వదినతో కలిసి కానుకగా ఇచ్చిన పెన్ను నాకెంతో ప్రత్యేకం. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆ పెన్నునే ఉపయోగించడాన్ని ఎంతో గౌరవంగా భావించా" అని నాగబాబు పేర్కొన్నారు.

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, అన్నయ్య ఇచ్చిన పెన్నుతో సంతకం చేస్తున్న ఫోటోను నాగబాబు షేర్ చేశారు. ఈ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

Naga Babu
Chiranjeevi
MLC
Andhra Pradesh
Janasena Party
Oath Ceremony
Social Media
Viral Post
Brotherly Love
Telugu Cinema
  • Loading...

More Telugu News