లోక్‌స‌భ ముందుకు వ‌క్ఫ్ బిల్లు... విప‌క్షాల‌పై కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు కీల‌క వ్యాఖ్య‌లు

  • వ‌క్ఫ్ బిల్లును లోక్‌స‌భలో ప్ర‌వేశ‌పెట్టిన మంత్రి కిర‌ణ్ రిజిజు
  • బిల్లులో లేని అంశాల‌ను లేవ‌నెత్తి ప్ర‌జ‌ల‌ను విప‌క్షాలు త‌ప్పుదోవ ప‌ట్టించాయ‌న్న మంత్రి
  • మైనారిటీల్లో అన‌వ‌స‌ర భ‌యాల‌ను సృష్టిస్తున్నార‌ని మండిపాటు
వివాద‌స్ప‌ద వ‌క్ఫ్ (స‌వ‌ర‌ణ) బిల్లు ఎట్ట‌కేల‌కు లోక్‌స‌భ ముందుకు వ‌చ్చింది. విప‌క్షాల నిర‌స‌న‌ల నడుమ బుధ‌వారం మ‌ధ్యాహ్నం కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం మంత్రి రిజిజు మాట్లాడుతూ... మంత్రి మండ‌లి ఆమోదం త‌ర్వాతే బిల్లును లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టిన‌ట్టు తెలిపారు. బిల్లుపై విప‌క్షాలు అన‌వ‌స‌రంగా వ‌దంతులు ప్ర‌చారం చేశాయ‌ని ఆరోపించారు. బిల్లులో లేని అంశాల‌ను లేవ‌నెత్తి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాయ‌ని మంత్రి విమ‌ర్శించారు. 

మైనారిటీల్లో అన‌వ‌స‌ర భ‌యాల‌ను సృష్టిస్తున్నార‌ని, 1954లో మొద‌టిసారి వ‌క్ఫ్ చ‌ట్టం అమ‌ల్లోకి వ‌చ్చింద‌న్నారు. స‌వ‌ర‌ణ బిల్లుతో ముస్లింల‌కు ఎలాంటి నష్టం ఉండ‌బోద‌ని కిర‌ణ్ రిజిజు తెలిపారు. యూపీఏ అధికారంలో ఉంటే ఢిల్లీలోని కీల‌క స్థలాలు వ‌క్ఫ్ సొంతం అయ్యేవ‌ని పేర్కొన్నారు. విలువైన భూముల‌ను కాంగ్రెస్ వ‌క్ఫ్‌కు క‌ట్ట‌బెట్టింద‌ని ఆరోపించారు. మ‌సీదుల నిర్వ‌హ‌ణ‌పై ఈ చ‌ట్టం ఎలాంటి ప్ర‌తికూల ప్ర‌భావం చూప‌బోద‌ని స్ప‌ష్టం చేశారు. వ‌క్ఫ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ‌ల‌పై ప్ర‌జ‌ల అనుమానాల‌ను నివృత్తి చేస్తామ‌న్నారు.   


More Telugu News