రూ.200 కోట్ల క్ల‌బ్‌లోకి ‘ఎల్‌2: ఎంపురాన్’.. చ‌రిత్ర సృష్టిస్తోందంటూ మోహ‌న్‌లాల్ ట్వీట్‌!

  • మోహ‌న్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబోలో ‘ఎల్‌2: ఎంపురాన్’
  • విడుద‌లైన 4 రోజుల్లోనే రూ.200 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు
  • 4 రోజుల్లోనే రూ. 200 కోట్లు రాబ‌ట్టిన‌ తొలి మ‌ల‌యాళ‌ చిత్రంగా రికార్డ్‌
మోహ‌న్‌లాల్ హీరోగా న‌టుడు, డైరెక్ట‌ర్‌ పృథ్వీరాజ్ సుకుమారన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాజా మ‌ల‌యాళ చిత్రం ‘ఎల్‌2: ఎంపురాన్’. మార్చి 27న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతోంది. మంజు వారియ‌ర్, టోవినో థామస్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 

అయితే, ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతునే మ‌రోవైపు వివాదాల్లో చిక్కుకుంది. గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించి ఒక వ‌ర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించిన విధంగా ఈ మూవీలో స‌న్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. కానీ, ఎన్ని వివాదాలు వ‌చ్చినా వ‌సూళ్ల ప‌రంగా మాత్రం ఈ చిత్రం త‌గ్గేదేలేదంటోంది.

తాజాగా ‘ఎల్‌2: ఎంపురాన్’ రూ.200 కోట్ల క్ల‌బ్‌లోకి చేరింది. రిలీజైన కేవ‌లం నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్స్ సాధించింది. దీంతో నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్లు రాబ‌ట్టిన‌ తొలి మ‌ల‌యాళ‌ చిత్రంగా ‘ఎల్‌2: ఎంపురాన్’ రికార్డుకెక్కింది. 

ఇక సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూ మోహ‌న్‌లాల్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. "ఓవర్‌లార్డ్ రూ. 200 కోట్ల మార్క్‌ను అద్భుతంగా దాటాడు. 'ఎంపురాన్' చరిత్ర సృష్టిస్తోంది" అంటూ మోహ‌న్‌లాట్ ట్వీట్ చేశారు. 


More Telugu News