Donthara Greeshma: యువ స్కేటర్ దొంతారా గ్రీష్మను అభినందించిన సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu Congratulates Young Skater Donthara Greeshma
  • అర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొని మూడు బంగారు పతకాలు సాధించిన గ్రీష్మ
  • రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందన్న సీఎం చంద్రబాబు
  • గత నెల 25 నుంచి 30 వరకు తైవాన్‌లో జరిగిన ఛాంపియన్ షిప్ పోటీలు
తైవాన్‌లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్ షిప్‌లో పాల్గొని మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్న విశాఖ నగరానికి చెందిన దొంతారా గ్రీష్మను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. విశాఖకు చెందిన యువ స్కేటర్ దొంతారా గ్రీష్మ మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలతో గ్రీష్మ రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకువస్తుందని ఆకాంక్షించారు.

గత నెల 25 నుంచి 30 వరకు ఛాంపియన్ షిప్ పోటీలు జరిగాయి. గ్రీష్మ పెయిర్, పెయిర్ డ్యాన్స్, క్వార్టెట్ విభాగాల్లో పోటీ పడి మూడు బంగారు పతకాలను కైవసం చేసుకుంది. అంతే కాకుండా మరో రెండు ఈవెంట్లలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ 16 ఏళ్ల యువ స్కేటర్ ప్రస్తుతం విశాఖ వ్యాలీ స్కూల్‌లో ప్లస్ టు చదువుతోంది. 
Donthara Greeshma
Artistic Roller Skating
Taiwan Championship
Roller Skating Gold Medals
Andhra Pradesh
Nara Chandrababu Naidu
Visakhapatnam
Youth Skater
Sports
India

More Telugu News