మయన్మార్‌లో 2 వేలు దాటిన భూకంప మరణాలు
- భూకంప ప్రభావంతో నేలమట్టమైన భవనాల వద్ద శిథిలాల తొలగింపు
- ఇప్పటి వరకు 2,056కు చేరుకున్న మృతుల సంఖ్య
- 3,900 మంది గాయపడినట్లు ప్రకటించిన సైనిక ప్రభుత్వం
మయన్మార్‌లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 2 వేలు దాటింది. భూకంపం ధాటికి నేలమట్టమైన భవనాల శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య 2,056కు చేరుకున్నట్లు సైనిక ప్రభుత్వం ప్రకటించింది. 3,900 మందికి గాయాలయ్యాయని, 270 మంది ఆచూకీ ఇంకా లభించాల్సి ఉందని తెలిపింది.
భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు భారత్‌తో పాటు యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా తదితర దేశాలు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించాయి. ఇదిలా ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లోని షియోమిలో 3.5 తీవ్రతతో భూమి కంపించింది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు.