సోలోగా విమానం నడిపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ... వీడియో ఇదిగో!

  • అఫీషియల్ గా పైలెట్ అయ్యానని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వెల్లడి
  • సోలోగా తొలి గగన విహారం వీడియో షేర్ చేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
  • కల సాకారమైందంటూ హర్షం 
వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పైలెట్ అయ్యారు. ఆయన స్వయంగా విమానం నడిపారు. ఓ చిన్న ప్రైవేట్ జెట్ విమానాన్ని నడిపిన కేతిరెడ్డి హైదరాబాద్ గగన వీధుల్లో విహరించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో పంచుకున్నారు. తన కల సాకారమైందని, ఇప్పుడు తానొక సర్టిఫైడ్ పైలెట్ అని వెల్లడించారు. 

"ఆకాశం ఇక హద్దు కాదు... ఇది ప్రారంభం మాత్రమే. ప్రతి సవాలుకు, ప్రతి పాఠానికి, ఈ ప్రయాణంలో నాకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇక మీదట అంతులేని సాహసాలే. ఒంటరిగా ఇదే నా తొలి గగన విహారం... అందుకు వింగ్స్ టీమ్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అంటూ కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ మేరకు తన ఫస్ట్ ఫ్లయింగ్  వీడియోను కూడా పంచుకున్నారు.


More Telugu News