Muslims: నల్ల బ్యాడ్జీలతో రంజాన్ ప్రార్థనలు చేసిన ముస్లింలు

Telangana Muslims Protest Wakf Bill with Black Badges During Ramadan Prayers
  • కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ముస్లింల నిరసన
  • కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన
  • మతాల మధ్య కేంద్రం చిచ్చు పెడుతోందని మండిపాటు  
తెలంగాణ వ్యాప్తంగా రంజాన్ పండుగను ముస్లింలు ఘనంగా జరుపుకుంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంలో ఈద్గాల వద్ద ముస్లింలు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రార్థనలు చేశారు. పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్న వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ వారు ఈ విధంగా నిరసనను వ్యక్తం చేశారు. 

కేంద్రం తీసుకురావాలనుకుంటున్న వక్ఫ్ వ్యతిరేక బిల్లును దేశంలోని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాలని ఈ సందర్భంగా వారు కోరారు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకునే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. చంద్రుగొండ, మహ్మద్ నగర్, తిప్పనపల్లి ఈద్గాల వద్ద ఈ మేరకు ముస్లింలు నిరసన వ్యక్తం చేశారు. 
Muslims
Telangana
Ramadan Prayers
Black Badges
Wakf Bill Protest
Central Government
Religious Protest
Chandrugonda
India
Political Parties

More Telugu News