సజీవ సమాధికి వ్యక్తి యత్నం.. అడ్డుకున్న పోలీసులు
- ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం విఠలాపురంలో ఘటన
- ఆలయం ముందు గొయ్యి తీసి వారం రోజులుగా అందులో ధ్యానం
- ఉగాది రోజున సజీవ సమాధి కావాలని నిర్ణయం
- గొయ్యిలోకి వెళ్లి పైన రేకు కప్పించి కుమారుడితో మట్టిపోయించుకున్న వైనం
- విషయం తెలిసి సజీవ సమాధిని అడ్డుకున్న పోలీసులు
ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం కోటిరెడ్డి గొయ్యిలోకి దిగి ధ్యానంలో మునిగిపోయాడు. వెంట వెళ్లిన కుమారుడు ఆ గొయ్యిపై రేకు ఉంచి దానిపై మట్టిపోసి పూడ్చేశాడు. విషయం తెలిసిన కోటిరెడ్డి తండ్రి అంజిరెడ్డి గ్రామస్థులతో కలిసి ఆలయం వద్దకు చేరుకుని కుమారుడిని బయటకు రావాలని కోరారు. అయితే, తన ధ్యానానికి ఎవరూ ఆటంకం కలిగించవద్దని కోటిరెడ్డి కోరాడు. మరోవైపు, సజీవ సమాధికి సంబంధించిన సమాచారం అందుకున్న తాళ్లూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో కోటిరెడ్డిని బయటకు తీశారు. అయితే, వారు వెళ్లిపోయిన తర్వాత మరోమారు ఆయన గోయ్యిలోకి దిగి ధ్యానం చేశాడు. చివరికి కుటుంబ సభ్యులు, స్థానికులు నచ్చజెప్పడంతో మధ్యాహ్నం ఇంటికి చేరుకున్నాడు.