కమలహాసన్ నాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు: పూనమ్ థిల్లాన్
- కమల్ సినిమా షూటింగ్ కు గంట ఆలస్యంగా వెళ్లానన్న పూనమ్ థిల్లాన్
- అందరూ ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించు అని కమల్ చెప్పారని వెల్లడి
- అప్పటి నుంచి షూటింగ్ కు ఎప్పుడూ ఆలస్యంగా వెళ్లలేదన్న పూనమ్
సినిమాల విషయంలో విలక్షణ నటుడు కమలహాసన్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. దశాబ్దాలుగా సినీ కెరీర్ కొనసాగుతున్నప్పటికీ ఆయన డెడికేషన్ మాత్రం అలాగే ఉంది. అయితే గతంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన పూనమ్ థిల్లాన్... కమలహాసన్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
కమలహాసన్ తో ఒక సినిమా చేసేటప్పుడు... షూటింగ్ కు ఆలస్యంగా వెళితే కమల్ సీరియస్ అయ్యారట. బాలీవుడ్ లో గంట ఆలస్యంగా వెళ్లినా ఎవరూ ఏమీ అనరని... తాము అలాగే అలవాటు అయి ఉన్నామని పూనమ్ థిల్లాన్ తెలిపారు. అందుకే కమల్ సినిమాకు కూడా గంట ఆలస్యంగా వెళ్లానని... తాను మూమూలుగానే ఉన్నప్పటికీ, సెట్స్ లో అందరూ తనను సీరియస్ గా చూస్తున్నారని చెప్పారు. కమల్ తన వద్దకు వచ్చి ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడిగారని తెలిపారు.
కెమెరా బాయ్స్, లైట్ బాయ్స్ అందరూ ఉదయం 5 గంటలకే వచ్చారని, వాళ్లంతా నీ కోసం గంట నుంచి ఎదురు చూస్తున్నారని కమల్ చెప్పారని అన్నారు. వాళ్లు ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించు అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారని తెలిపారు. అప్పుడు తనకు తన తప్పు తెలిసిందని, అందరికీ సారీ చెప్పానని వెల్లడించారు. అప్పటి నుంచి ఎప్పుడూ సెట్స్ కు ఆలస్యంగా వెళ్లలేదని చెప్పారు.