Nara Lokesh: విశాఖలో జై షాతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

Minister Nara Lokesh Watches IPL Match with Jay Shah in Visakhapatnam
  • విశాఖలో ఐపీఎల్ మ్యాచ్
  • సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • మంత్రి లోకేశ్, జై షాలకు విశాఖలో ఘనస్వాగతం
ఏపీ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ కు హాజరయ్యారు. విశాఖలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ ను నారా లోకేశ్ ఐసీసీ ఛైర్మన్ జైషాతో కలిసి వీక్షించారు. 

అంతకుముందు విశాఖ క్రికెట్ స్టేడియానికి చేరుకున్న మంత్రి లోకేశ్, ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీలకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్ని, ఇతర సభ్యులు ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేశ్ ను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని శాలువాతో సత్కరించి మొమెంటో బహూకరించారు.  

అనంతరం స్టేడియం పునరుద్ధరణ, ఆధునికీకరణను పురస్కరించుకుని ఐసీసీ ఛైర్మన్ జై షా, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని చిన్నితో కలిసి నారా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్,  విశాఖ ఎంపీ శ్రీ భరత్,  మాజీ క్రికెటర్ చాముండేశ్వరినాథ్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఏసీఏ సెక్రటరీ సానా సతీష్, ట్రెజరర్ దండమూడి శ్రీనివాస్, ఇతర ఏసీఈ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కూడా పాల్గొన్నారు. 

ఇవాళ విశాఖ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు.
Nara Lokesh
IPL Match
Visakhapatnam
Jay Shah
Roger Binny
ACA-VDCA Stadium
Andhra Cricket Association
Sunrisers Hyderabad
Delhi Capitals
Indian Cricket

More Telugu News