Ponnam Prabhakar: వేదికపై కరాటే చేసిన మంత్రి పొన్నం, స్పీకర్ గడ్డం ప్రసాద్... వీడియో ఇదిగో!

Minister Ponnam  Speaker Gaddams Karate Display at Kyo Championship

  • హైదరాబాదులో కరాటే నేషనల్ టోర్నమెంట్
  • గచ్చిబౌలిలో ప్రారంభోత్సవం
  • ప్రారంభోత్సవానికి హాజరైన తెలంగాణ ప్రభుత్వ పెద్దలు

హైదరాబాదులోని గచ్చిబౌలిలో 4వ కియో కరాటే ఛాంపియన్ షిప్ ప్రారంభమైంది. ఈ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్ ప్రారంభోత్సవంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కరాటే డ్రెస్ లు వేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి పొన్నం... వేదికగా సరదాగా స్పేరింగ్ చేశారు. అనంతరం నవ్వుతూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వారిద్దరికీ టోర్నీ ఆర్గనైజర్స్ గౌరవ బ్లాక్ బెల్టులు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. 

కాగా, కియో కరాటే పోటీలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. ఇవాళ్టి ప్రారంభోత్సవంలో భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ఆణిముత్యం నిఖత్ జరీన్ కూడా పాల్గొని, స్ఫూర్తిదాయకంగా ప్రసంగించింది.

Ponnam Prabhakar
Gaddam Prasad
Telangana Assembly Speaker
Minister Ponnam
Kyo Karate Championship
Hyderabad
Martial Arts
Nikhat Zareen
Sports
Telangana Politics
  • Loading...

More Telugu News