Myanmar Earthquake: తీవ్ర విషాదం... భూకంపం తీవ్రతకు కుప్పకూలిన వెయ్యి పడకల ఆసుపత్రి

1000 Bed Hospital Collapses in Myanmar Earthquake
  • మయన్మార్, థాయ్ లాండ్ ను వణికించిన భూకంపం
  • మయన్మార్ రాజధానిలో కుప్పకూలిన వెయ్యి పడకల ఆసుపత్రి
  • ఇక్కడే అత్యధిక ప్రాణనష్టం ఉంటుందని అంచనా
భారీ భూకంపం మయన్మార్, థాయ్ లాండ్ లను వణికించింది. భూకంప తీవ్రతకు ఎన్నో భవంతులు కుప్పకూలిపోయాయి. శిథిలాల కింద ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో అంచనా వేయలేని పరిస్థితి ఉంది. 

మరోవైపు మయన్మార్ రాజధాని నేపిడాలో వెయ్యి పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఎక్కువ ప్రాణ నష్టం, అత్యధికంగా క్షతగాత్రులు ఇక్కడే ఉంటారని భావిస్తున్నారు. ఈ ఆసుపత్రిని కొత్తగా నిర్మించారు. ఇంకా పేరు కూడా పెట్టలేదు. ఆసుపత్రి శిథిలాల్లో తమ ఆత్మీయుల కోసం ఎంతో మంది గాలిస్తున్నారు. ఈ ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది.

థాయ్ లాండ్, మయన్మార్ తో పాటు ఇండియా, చైనా, బంగ్లాదేశ్, వియత్నాం సహా పలు తూర్పు ఆసియా దేశాల్లో ప్రకంపనలు వచ్చాయి. 7.7, 6.4, 4.9 తీవ్రతతో మూడు భూకంపాలు వచ్చాయి. 

మయన్మార్ లోని మాండలేలో మసీదు కూలి దాదాపు 20 మంది ప్రాణాలు కోల్పోయారు. టవుంగూలో పునరావాస కేంద్రం కుప్పకూలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాల్లో సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి.   
Myanmar Earthquake
Thailand Earthquake
Naypyidaw Hospital Collapse
1000-bed hospital
Earthquake victims
Southeast Asia Earthquake
7.7 magnitude earthquake
6.4 magnitude earthquake
Disaster Relief
Building Collapse

More Telugu News