ధోనీని చూసే ఆ విషయం నేర్చుకున్నా.. ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్

  • ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఎలా ఉండాలో ధోనీని చూసే నేర్చుకున్నా
  • అన్నింటికీ ఎక్కువగా స్పందించను.. ఒత్తిడిని ఎదుర్కోగలను
  • 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ సిక్సర్‌ను ఎవరూ మర్చిపోలేరు
  • ప్రపంచ చెస్ చాంపియన్ గుకేశ్
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీని చూసే ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటాన్ని నేర్చుకున్నానని ప్రపంచ చెస్ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ చెప్పాడు. ఒత్తిడిలో ఎలా ఉండాలనే విషయంలో ధోనీనే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నాడు. అన్నింటికీ ఎక్కువగా స్పందించనని, ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొనగలనని వివరించాడు. తన కెరియర్‌పై ధోనీ ప్రభావం ఎంతో ఉందని వివరించాడు. 

2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించిన తీరు తనకు ఎప్పుడూ గుర్తుంటుందని గుకేశ్ తెలిపాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్ ప్రతి ఒక్కరికీ ఒక తీపిగుర్తు అని, ఫైనల్‌లో సిక్సర్ కొట్టి ధోనీ మ్యాచ్‌ను గెలిపించిన తీరు ఎప్పటికీ గుర్తుంటుందని చెప్పాడు. కాగా, గతేడాది డంగ్ లీరెన్‌పై గెలిచి ప్రపంచ ఛాంపియన్ అయిన గుకేశ్.. భారత్ తరపున విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఆ ఘనత దక్కించుకున్న ఆటగాడిగా రికార్డులకెక్కాడు.


More Telugu News