మోదీ ఆహ్వానం మేరకు ఇండియాకు వస్తున్న పుతిన్

Putin to Visit India at Modis Invitation
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇండియా పర్యటనకు వస్తున్నారు. భారత్ పర్యటనకు రావాలంటూ ప్రధాని మోదీ చేసిన ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ తెలిపారు. పుతిన్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. 

'రష్యా అండ్ ఇండియా: టువార్డ్ ఏ బైలేటరల్ అజెండా' పేరుతో రష్యన్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో లావ్రోవ్ మాట్లాడుతూ ఈ మేరకు వివరాలను వెల్లడించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత మోదీ తొలి అంతర్జాతీయ పర్యటన రష్యాలో చేశారని చెప్పారు.

గత ఏడాది జులైలో మోదీ రష్యాలో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ లో పర్యటించాలని పుతిన్ ను మోదీ ఆహ్వానించారు. అమెరికా టారిఫ్ ల ముప్పు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంప్రదింపులు జరుగుతున్న తరుణంలో పుతిన్ భారత్ లో పర్యటించనుండటం గమనార్హం.
Go Back to Shorts
Vladimir Putin
India visit
Narendra Modi
Russia-India relations
bilateral agenda
Sergey Lavrov
US tariffs
Russia-Ukraine war
International relations
Putin's India trip

More Telugu News