Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ మరణంపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

YS Sharmilas Sensational Remarks on Pastor Praveens Death
  • ప్రమాదం కాదు పక్కా ప్లాన్ తో చేసిన హత్యేనని ఆరోపణలు
  • ఘటనా స్థలంలో ఆధారాలు చాలా రుజువులు ఉన్నాయన్న ఏపీ కాంగ్రెస్ చీఫ్
  • ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన షర్మిల
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మరణంపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో మరణించలేదని, పక్కా ప్రణాళికతో హత్య చేశారని ఆమె ఆరోపించారు. అది హత్యే అని చెప్పడానికి సంఘటనా స్థలంలో అనేక ఆధారాలు కనిపించాయని ఆమె పేర్కొన్నారు. ప్రవీణ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులతో పాటు అనుచరులు, తోటి పాస్టర్లు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని షర్మిల చెప్పారు.

ప్రవీణ్ మృతిపై నెలకొన్న అన్ని సందేహాలను నివృత్తి చేసేలా ఈ కేసులో ఫాస్ట్ ట్రాక్ విచారణ జరిపించి నిజానిజాలు వెలికితీయాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ షర్మిల ట్వీట్ చేశారు. కాగా, హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు బైక్‌పై బయలుదేరిన పాస్టర్ ప్రవీణ్ దివాన్ చెరువు-కొంతమూరు హైవేపై అనుమానాస్పద రీతిలో మరణించిన విషయం తెలిసిందే.
Pastor Praveen
Suspicous Death
YS Sharmila
Andhra Pradesh
Murder Allegations
Bike Accident
Fast Track Investigation
Congress
Political Reactions
Highway Death

More Telugu News