పదో తరగతి పేపర్ లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు, పలు ప్రాంతాల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా నిన్న కామారెడ్డి జిల్లాలో పేపర్ లీక్ అయింది. జుక్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను సిబ్బంది లీక్ చేశారు. 

పరీక్షకు కొన్ని నిమిషాల ముందు కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపారు. ఆ ప్రశ్నలు సోషలో మీడియాలో వైరల్ అయ్యాయి. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ సునీల్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్ భీమ్, ఇన్విజిలేటర్ దీపికను విధుల నుంచి సస్పెండ్ చేశారు.

Sunil
Deepa
Bheem
Telangana 10th Class Exams
Question Paper Leak
Kamal Reddy District
SSC Exam Leak
Educational Fraud
Suspension of Teachers
Exam irregularities

More Telugu News