Ganja: గంజాయి లేడీ డాన్ సంగీత సాహును ఒడిశాలో అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు

Hyderabad Police Arrest Ganja Lady Don Sangita Sahu in Odisha
  • హైదరాబాద్‌లో ఐదు కేసులు నమోదైనట్లు తెలిపిన పోలీసులు
  • ఒడిశా వెళ్లి అరెస్టు చేసిన ఎస్టీఎఫ్ పోలీసులు
  • నాలుగేళ్ల క్రితం గంజాయి వ్యాపారంలోకి దిగిన సంగీత సాహు
గంజాయి సరఫరా కేసుల్లో నిందితురాలు, గంజాయి లేడీ డాన్ సంగీత సాహును ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెపై హైదరాబాద్‌లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఒడిశా వెళ్లిన ఎక్సైజ్ ఎస్టీఎఫ్ పోలీసులు, అక్కడి పోలీసుల సహకారంతో ఆమెను అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు.

సంగీత సాహు ఒడిశాలోని కుర్ధా జిల్లా, కాళీకోట్ గ్రామానికి చెందిన వ్యక్తి. ఆమె దాదాపు నాలుగేళ్ల క్రితం గంజాయి వ్యాపారంలోకి ప్రవేశించింది. వివిధ రాష్ట్రాల గంజాయి వ్యాపారులతో సంబంధాలు నెరుపుతూ, వారికి గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

గతంలో హైదరాబాద్‌లోని దూల్‌పేటలో ఇద్దరు వ్యక్తులకు 41.3 కిలోల గంజాయిని సరఫరా చేస్తూ పట్టుబడింది. దూల్‌పేటలో పలువురికి ఆమె గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. సంగీత సాహు ఇన్‌స్టాగ్రామ్‌లో సినీ నటిలా వీడియోలు పోస్టు చేస్తుందని పోలీసులు పేర్కొన్నారు. కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న ఆమెను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు.
Ganja
Hyderabad Police
Drug Trafficking

More Telugu News