Jagdeep: తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. యోగా టీచర్‌ను ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టిన భర్త!

Yoga Teacher Buried Alive in Haryana Over Extramarital Affai
  • బాధితుడిని డిసెంబర్‌లో కిడ్నాప్ చేసిన నిందితుడు
  • తన భార్యతో వివాహేతర సంబంధం ఉందని ఘాతుకం
  • కాళ్లు, చేతులు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి బతికి ఉండగానే పాతిపెట్టిన వైనం
తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కారణంతో యోగా టీచర్‌ను ఓ వ్యక్తి ఏడడుగుల గొయ్యిలో సజీవంగా పాతిపెట్టాడు. హర్యానాలోని చక్రి దాద్రిలో జరిగిందీ ఘటన. బాధితుడు జగదీప్ రోహ్‌తక్‌లోని ఓ ప్రైవేటు యూనివర్సిటీలో యోగా టీచర్. ఆయనను కిడ్నాప్ చేసిన నిందితుడు ఏడుగుల గొయ్యి తీసి అందులో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. మూడు నెలల తర్వాత ఈ నెల 24న జగదీప్‌ మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. 

పోలీసుల కథనం ప్రకారం.. డిసెంబర్ 24న జగదీప్‌ ఇంటికి వస్తుండగా నిందితుడు ఆయనను కిడ్నాప్ చేశాడు. కాళ్లు, చేతులు కట్టేశాడు. ఆపై అరవకుండా నోటికి ప్లాస్టర్ వేశాడు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అప్పటికే సిద్ధం చేసిన గోతిలో ఆయనను సజీవంగా పాతిపెట్టాడు. జగదీప్ కనిపించడం లేదంటూ కేసు నమోదు కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయన కాల్ రికార్డులను పరిశీలించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు నిందితులు ధర్మపాల్, హర్‌దీప్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణ సందర్భంగా నిందితుడు భయంకరమైన నిజాలను వెల్లడించాడు. నిందితుడు ఉంటున్న భవనంలోనే జగదీప్ అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో నిందితుడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అంతిమంగా ఇది ఆయన హత్యకు దారితీసింది. 
Jagdeep
Yoga Teacher Murder
Haryana
Chakra Dadi
Rohtak
Dharm Pal
Hardeep
Extramarital Affair
Murder Case
Buried Alive

More Telugu News