Pilot: పాపం పైలెట్... పాస్ పోర్టు మరిచిపోయాడు!

Pilot Forgets Passport Causes 6 Hour Flight Delay

  • పాస్ పోర్టు మరచిపోవడంతో విమానాన్ని వెనక్కు మళ్లించిన పైలెట్
  • అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానంలో ఘటన 
  • ఆరుగంటలు ఆలస్యంగా గమ్య స్థానాలకు చేరిన ప్రయాణికులు

ఓ విమాన పైలట్ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులు ఆరు గంటల ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరుకున్నారు. ఇటీవల లాస్ ఏంజెలెస్ నుంచి చైనాలోని షాంఘై నగరానికి బయలుదేరిన అమెరికాకు చెందిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ విమానం పసిఫిక్ మహాసముద్రం మీదుగా రెండు గంటల ప్రయాణం సాగిన అనంతరం అకస్మాత్తుగా వెనక్కి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోలో దిగింది.

ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. తొలుత ఏమి జరిగిందో తెలియక కొద్దిసేపు కంగారుపడ్డారు. విధుల్లో ఉన్న పైలట్ తన పాస్‌పోర్ట్ మరిచిపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొన్నట్లు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురైనా తర్వాత ఊపిరి పీల్చుకున్నారు.

మరోపక్క ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని, ఆహారంతో పాటు పరిహారాన్ని ఇవ్వనున్నట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. అదే రోజు సాయంత్రం వారిని గమ్యస్థానాలకు పంపించామని వెల్లడించింది. అయితే సాధారణ సమయంతో పోలిస్తే ఆరు గంటల ఆలస్యంగా విమానం షాంఘై చేరుకుందని తెలిపింది. 

Pilot
United Airlines
Boeing
Passport
Flight Delay
San Francisco
Shanghai
Los Angeles
Pacific Ocean
Air Travel
  • Loading...

More Telugu News