KCR: తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

KCRs Stern Warning on Telanganas Future

  • రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా
  • పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేసీఆర్
  • ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్య

తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరిఖని నుంచి పాదయాత్రతో కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకున్నారు. ఫాంహౌస్‌లో పాదయాత్ర చేసిన బృందంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒంటరిగానే మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయని, తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు. కానీ ఇప్పుడు అదే తెలంగాణ సమస్యల వలయంలో చిక్కుకుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు. అందరూ ఒక్కో కేసీఆర్‌లా తయారు కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో అధికారం బీఆర్ఎస్‌దే అన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు.

KCR
Telangana
BRS
K Chandrashekar Rao
Telangana Politics
India Politics
Korukanti Chander
Goadavarikhani
Political Allegations
State Elections
  • Loading...

More Telugu News