Shivarajkumar: జుబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్

Shivarajkumar Visits Pedda Amma Temple in Hyderabad

  • సతీమణితో కలిసి పెద్దమ్మతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన శివరాజ్ కుమార్
  • తీర్థప్రసాదాలు అందించిన అర్చకులు
  • శివరాజ్ కుమార్‌ను చూసేందుకు ఆసక్తి చూపిన హైదరాబాదీలు

ప్రముఖ కన్నడ నటుడు శివరాజ్ కుమార్ హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో గల పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

పెద్దమ్మ తల్లి ఆలయానికి శివరాజ్ కుమార్ విచ్చేసిన విషయం తెలుసుకుని, అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్సీ 16' చిత్రంలో శివరాజ్ కుమార్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ చేరుకున్నారు.

Shivarajkumar
Jubilee Hills
Pedda Amma Temple
Hyderabad
Ram Charan
RC16
Kannada Actor
Telugu Film
Movie Shooting
  • Loading...

More Telugu News