Chiranjeevi: ఆ కోణం నుంచి చూస్తే మీరొక ఛాంపియన్: చిరంజీవిపై చంద్రబాబు ప్రశంసల జల్లు

Chandrababu Naidu Congratulates Chiranjeevi on Prestigious honor
  • యూకే పార్లమెంటులో చిరంజీవికి విశిష్ట సన్మానం
  • లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు ప్రదానం
  • హార్టీ కంగ్రాచ్యులేషన్స్ చిరంజీవి గారూ అంటూ చంద్రబాబు ట్వీట్
యూకే పార్లమెంటులో అక్కడి ఎంపీల సమక్షంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఘన సన్మానం జరగడం తెలిసిందే. బ్రిడ్జ్ ఇండియా సంస్థ చిరంజీవిని బ్రిటన్ చట్టసభ వేదికగా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుతో గౌరవించింది. ఈ పురస్కారం నేపథ్యంలో చిరంజీవిపై అభినందనల వర్షం కురుస్తోంది. 

తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు. చిరంజీవి గారూ... హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అంటూ ట్వీట్ చేశారు. 

"సాంస్కృతిక నాయకత్వం, ప్రజాసేవలో అత్యుత్తమ కృషికి బ్రిటన్ లో మీకు జీవితకాల సాఫల్య పురస్కారం లభించడం అభినందనీయం. మానవతా దృక్పథ కోణం నుంచి చూస్తే మీరొక ఛాంపియన్. మీరు ఎన్నో జీవితాలను ప్రభావితం చేయడమే కాదు, ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు" అంటూ చంద్రబాబు కొనియాడారు.
Chiranjeevi
Chandrababu Naidu
Lifetime Achievement Award
UK Parliament
Bridge India
Tollywood
MegaStar
Award Ceremony
Humanitarian
Cultural Leadership

More Telugu News