సందీప్‌రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో ఎంఎస్ ధోనీ... నెట్టింట వీడియో వైర‌ల్‌!

  • ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్ర‌క‌ట‌న కోసం ధోనీని డైరెక్ట్ చేసిన సందీప్‌రెడ్డి వంగా
  • ఆ యాడ్ తాలూకు ప్రోమో వీడియోలు వైర‌ల్‌
  • యానిమ‌ల్ సినిమాలో హీరో ర‌ణ‌బీర్ క్యారెక్ట‌ర్‌లో అద‌ర‌గొట్టిన ఎంఎస్‌డీ
తెలుగు ద‌ర్శ‌కుడు సందీప్‌రెడ్డి వంగా 'యానిమ‌ల్' సినిమాతో పాన్ ఇండియా డైరెక్ట‌ర్‌గా మారిపోయారు. ర‌ణ‌బీర్ క‌పూర్ హీరోగా వ‌చ్చిన ఈ మూవీ భారీ వ‌సూళ్ల‌తో సాండీ స్థాయిని అమాంతం పెంచేసింది. దీంతో ఆయ‌న ప్ర‌భాస్‌తో తీయ‌బోయే 'స్పిరిట్' చిత్రంపై భారీ అంచనాలు నెల‌కొన్నాయి. 

ఇదిలాఉంటే.. సందీప్‌రెడ్డి వంగా డైరెక్ష‌న్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ న‌టించిన ఓ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఓ ఎల‌క్ట్రిక్ సైకిల్ కంపెనీ ప్ర‌క‌ట‌న తాలూకు వీడియో అది. వీడియోలో 'యానిమ‌ల్' సినిమాలో హీరో ర‌ణ‌బీర్ క్యారెక్ట‌ర్‌లో ధోనీ సైకిల్‌పై రావ‌డాన్ని సందీప్‌రెడ్డి చిత్రీక‌రించ‌డం మ‌నం చూడొచ్చు. 

కాగా, ఈ యాడ్‌కు సంబంధించిన పూర్తి వీడియో త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ప్రోమోలే సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఎంఎస్‌డీ, సాండీ కాంబోలోని యాడ్ తాలూకు ప్రోమోపై మీరు కూడా ఒక లుక్కేయండి.  


More Telugu News

MS Dhoni Sandeep Reddy Vanga Viral Video Electric Bicycle Ad Animal Movie Ranbir Kapoor Prabhas Spirit Movie Telugu Director Bollywood