Posani Krishna Murali: ముగిసిన పోసాని సీఐడీ విచారణ

Posani Krishna Muralis CID Inquiry Concludes
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ పూర్తయింది.  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను విచారించారు.  విచారణ అనంతరం జైలుకు తరలించగా, సీఐడీ మరోసారి విచారణ కోసం కోర్టును ఆశ్రయించనుంది. పోసాని బెయిల్ పిటిషన్ విచారణ బుధవారానికి వాయిదా పడింది.
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి సీఐడీ విచారణ ముగిసింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈరోజు పోసానిని ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. 

కోర్టు పోసానిని ఒక రోజు సీఐడీ కస్టడీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. విచారణ ముగియడంతో ఆయనకు గుంటూరు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించి జిల్లా జైలుకు తరలించారు. దాదాపు నాలుగు గంటల సేపు విచారణ కొనసాగింది. 

అయితే, పోసానిని మరోసారి విచారించాలని సీఐడీ నిర్ణయించింది. దీనికోసం మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరనుంది. మరోవైపు పోసాని బెయిల్ పిటిషన్ పై విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. పీటీ వారెంట్ పై పోసానిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించిన సంగతి తెలిసిందే.
Posani Krishna Murali
AP CID
Pawan Kalyan
Nara Lokesh

More Telugu News