Chandrababu: తమ్ముడు రామ్మూర్తినాయుడు జయంతి వేళ నివాళి అర్పించిన సీఎం చంద్రబాబు

Chandrababu pays tributes to his brother birth anniversary
  • గతేడాది నవంబరులో కన్నుమూసిన నారా రామ్మూర్తినాయుడు
  • నేడు (మార్చి 18) రామ్మూర్తినాయుడి జయంతి
  • సోదరుడి జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయంటూ చంద్రబాబు భావోద్వేగ స్పందన 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు గతేడాది నవంబరులో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇవాళ (మార్చి 18) రామ్మూర్తి నాయుడి జయంతి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

"నా సోదరుడు నారా రామ్మూర్తినాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. మా కుటుంబంలోనే కాకుండా ప్రజాక్షేత్రంలో కూడా ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. అందుకే ఆయన భౌతికంగా దూరమైనా జ్ఞాపకాలు పదిలంగా ఉన్నాయి. ఆయన స్మృతికి మరొక్కసారి నివాళి అర్పిస్తున్నాను" అంటూ తన పోస్టులో పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా చంద్రబాబు తన తమ్ముడితో కలిసున్న ఫొటోను కూడా పంచుకున్నారు.
Chandrababu
Nara Rammurthy Naidu
Birth Anniversary
TDP

More Telugu News