Chandrababu Pawan: నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఢిల్లీకి పయనం

cm chandrababu delhi tour schedule for two days
  • సాయంత్రం 4.30 గంటలకు గన్నవరం నుంచి ఢిల్లీ పర్యటనకు సీఎం, డిప్యూటీ సీఎం
  • ఈ రాత్రి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకకు హజరు
  • రేపు ప్రధాని మోదీతో సహా కేంద్ర మంత్రులతో సమావేశాలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లు ఈ రోజు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు విజయవాడ (గన్నవరం) నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. 

రాత్రి 7 గంటలకు సీఎం, డిప్యూటీ సీఎంలు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడి వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. ఈ రాత్రికి ఇద్దరూ ఢిల్లీలో బస చేయనున్నారు. 

ఢిల్లీ పర్యటనలో భాగంగా రేపు (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులను ముఖ్యమంత్రి చంద్రబాబు కలవనున్నారు. రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించనున్నారు. 

ఈ క్రమంలో రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిధులతో పాటు పలు అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించనున్నారు. బుధవారం రాత్రికి ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం, డిప్యూటీ సీఎం అమరావతికి చేరుకుంటారు.   
Chandrababu Pawan
Delhi Tour
Amaravati
PM Modi

More Telugu News