తాను ఆమిర్ ఖాన్‌తో ఎందుకు ప్రేమ‌లో పడ్డానో చెప్పిన గౌరీ స్ప్ర‌త్‌

  • త‌న 60వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా గౌరీతో డేటింగ్ చేస్తున్న‌ట్టు చెప్పిన ఆమిర్‌ 
  • గ‌త ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డి
  • తాజాగా విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించిన జంట‌
  • ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్న గౌరీ స్ప్ర‌త్‌
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్‌ ఆమిర్ ఖాన్ త‌న 60వ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంలో త‌న స్నేహితురాలు గౌరీ స్ప్ర‌త్‌తో డేటింగ్ చేస్తున్న‌ట్లు చెప్పి అంద‌రినీ ఆశ్చ‌ర్యంలో ముంచెత్తిన విష‌యం తెలిసిందే. గౌరీతో త‌న‌కు పాతికేళ్ల ఫ్రెండ్‌షిప్ ఉన్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌... గ‌త ఏడాది కాలంగా ఆమెతో డేటింగ్‌లో ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. బెంగ‌ళూరుకు చెందిన ఆమె త‌న‌ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో ప‌నిచేస్తున్న‌ట్లు ఆమిర్ తెలిపారు. దాంతో నెటిజ‌న్లు గౌరీ గురించి తెగ వెతికారు కూడా. 

ఈ క్ర‌మంలో తాజాగా ఈ జంట మ‌రోసారి విలేక‌ర్ల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా ఆమిర్‌తో రిలేష‌న్ షిప్‌పై గౌరీ స్ప్ర‌త్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు ఆమె ఎలాంటి భాగ‌స్వామి కావాల‌నుకుంది, ఆమిర్‌నే ఎందుకు ఎంచుకుంది అనే విష‌యాల‌ను గౌరీ వెల్ల‌డించింది. "దయగల వ్యక్తి, జెంటిల్‌మన్‌, నా ప‌ట్ల‌ శ్రద్ధగల వ్యక్తిని కోరుకున్నాను" అని ఆమె చెప్పారు. ఈ విష‌యాల‌ను ఆమిర్‌లో గుర్తించిన‌ట్లు పేర్కొన్నారు. 

అలాగే ఆమిర్ కూడా మాట్లాడుతూ... "నేను ప్రశాంతంగా ఉండగలిగే, నాకు శాంతిని ఇచ్చే వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఆమె గౌరీ అని అనిపించింది" అంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు.

కాగా, గౌరి స్ప్రత్ కు ఆరేళ్ల పాప ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News