Abu Qatal: లష్కరే తోయిబాకు భారీ ఎదురుదెబ్బ.. మోస్ట్ వాడెంట్ అబు ఖతల్ కాల్చివేత

Lashkar e Taiba most wanted terrorist Abu Qatal killed in Pakistan
  • జెహ్లం సింధ్ ప్రాంతంలో అబు ఖతల్‌ను కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు
  • 26/11 ముంబై దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు 
  • గతేడాది జమ్మూకశ్మీర్‌లో భక్తుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో ప్రధాన సూత్రధారి
  • భారత్‌కు మోస్ట్ వాంటెడ్
పాకిస్థాన్‌కు చెందిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అబు ఖతల్ అలియాస్ ఖతల్ సింధి గతరాత్రి పాకిస్థాన్‌లో హత్యకు గురయ్యాడు. జెహ్లం సింధ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతడిని కాల్చి చంపారు. 

జమ్మూకశ్మీర్‌లో పలు దాడులకు సూత్రధారిగా వ్యవహరించిన అబు ఖతల్ 26/11 ముంబై దాడుల మాస్టర్‌మైండ్ హఫీజ్ సయీద్‌కు అత్యంత సన్నిహితుడు. గతేడాది జూన్ 9న జమ్మూకశ్మీర్‌ రియాసీ జిల్లాలోని శివఖోరి ఆలయం నుంచి భక్తులతో వస్తున్న బస్సుపై జరిగి ఉగ్రదాడిలో అబు ఖతల్ కీలక పాత్ర పోషించాడు. అతడి నేతృత్వంలో ఈ దాడికి పథక రచన జరిగింది. 

అబు ఖతల్‌ను హఫీజ్ సయాద్ లష్కరే తోయిబా చీఫ్ ఆపరేరేషనల్ కమాండర్‌గా నియమించాడు. కశ్మీర్ దాడులకు హఫీజ్ ఇచ్చే ఆదేశాలను అబు ఖతల్ పాటించేవాడు. 2023 రాజౌరీ దాడుల కేసులో అబు ఖతల్‌ పేరును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది.  
Abu Qatal
Lashkar-e-Taiba
Pakistan

More Telugu News