ISIS: ఐసిస్ ను మరోసారి భారీ దెబ్బకొట్టిన అమెరికా

isis chief of global operations abu khadijah killed by us missile strike
  • అమెరికా వైమానిక దాడిలో ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబూ ఖదీజా హతం
  • అబూ ఖదీజా‌తో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మృతి
  • అమెరికా సహకారంతో ఆపరేషన్ విజయవంతం చేసినట్లు పేర్కొన్న ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుదానీ
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ (ఐసిస్)ను అమెరికా భారీగా దెబ్బకొట్టింది. వైమానిక దాడి చేసి ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దల్లా మక్కి ముస్లిహ్ అల్ రిపాయ్ అలియాస్ అబూ ఖదీజాను మట్టుబెట్టింది. 

ఇరాకీ ఇంటెలిజెన్స్ సమాచారంతో అమెరికా వైమానిక దళం దాడి చేపట్టింది. ఈ నెల 13న జరిపిన ఈ వైమానిక దాడిలో ఐసిస్ గ్రూపులో రెండో స్థాయి కమాండెంట్‌గా ఉన్న అబూ ఖదీజాతో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా హతమయినట్లు తెలుస్తోంది. డీఎన్ఏ పరీక్షల ద్వారా అబూ ఖదీజా మృతదేహాన్ని అధికారులు ధ్రువీకరించారు.
 
ఈ అంశంపై ఇరాక్ ప్రధాని మొహమ్మద్ షియా అల్ సుదానీ స్పందించారు. ఇరాక్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఖదీజా మోస్ట్ డేంజరస్ ఉగ్రవాది అని చెప్పారు. అమెరికా సహకారంతో ఆపరేషన్ విజయవంతం చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా, వైమానిక దాడికి సంబంధించి వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో పంచుకుంది. 
   
ISIS
Abu Khadijah
America Missile Strike

More Telugu News