Rajasthan: వింత ఆచారం.. రాళ్ల‌తో హోలీ.. రెండు వ‌ర్గాలుగా విడిపోయి కుమ్ములాట‌!

Holi Celebrations With Stones 42 People Injured At Rajasthan
  • రాజ‌స్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో రంగుల‌తో కాకుండా రాళ్ల‌తో హోలీ
  • శుక్ర‌వారం నాడు కూడా అక్క‌డి వారు ఇలాగే వేడుక‌లు చేసుకున్న వైనం
  • ఈ వేడుక‌ల్లో 42 మందికి గాయాలు.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం
మాములుగా హోలీ పండుగ అంటే పిల్లలు, పెద్దలు అంతా కలిసి ఒక‌రిపై ఒక‌రు రంగులు చ‌ల్లుకుని ఆనందోత్సాహాలతో జ‌రుపుకుంటారు. కానీ, రాజ‌స్థాన్‌లోని దుంగార్‌పూర్‌లో మాత్రం ఈ పండుగ రోజున అక్క‌డి స్థానికులు వింత ఆచారం పాటిస్తున్నారు. రంగుల‌తో కాకుండా రాళ్ల‌తో హోలీ జ‌రుపుకుంటారు. స్థానికులు రెండు వ‌ర్గాలుగా విడిపోయి ఒక‌రిపై ఒక‌రు రాళ్లు రువ్వుకుంటారు. అవును మీరు విన్న‌ది నిజ‌మే. 

శుక్ర‌వారం నాడు కూడా అక్క‌డి వారు ఇలాగే వేడుక‌లు చేసుకున్నారు. ఈ వేడుక‌ల్లో 42 మంది గాయ‌ప‌డ్డారు. వీరిలో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం వారు ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. గ‌త 20 ఏళ్లుగా దుంగార్‌పూర్‌లోని స్థానికులు ఇదే ఆచారాన్ని పాటిస్తున్నార‌ని ఓ ఆరోగ్య కార్య‌క‌ర్త తెలిపారు.

Rajasthan
Holi Celebrations
Holi Festival

More Telugu News