హిందీ భాషపై పవన్ వ్యాఖ్యలకు ప్రకాశ్‌రాజ్ రియాక్షన్ ఇదే!
- భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదన్న పవన్ కల్యాణ్
- హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదన్న ప్రకాశ్ రాజ్
- స్వాభిమానంతో మాతృభాషను కాపాడుకోవడమని పవన్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్ అంటూ ట్వీట్
'మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్' అంటూ ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలో పవన్ చేసిన వ్యాఖ్యలకు ప్రకాశ్‌రాజ్ ఈ విధంగా స్పందించారు. ఇంతకూ పవన్ కల్యాణ్ ఏమన్నారంటే.. 'మాట్లాడితే దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు. అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు వద్దు అంటుంటే నా మనసులో ఒకటే అనిపిస్తుంది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్ గఢ్ నుంచి డబ్బులు కావాలి.. పనిచేసే వాళ్లు అందరూ బీహార్ నుంచి కావాలి కానీ హిందీని ద్వేషిస్తాం అంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలి, భాషలను ద్వేషించాల్సిన అవసరం లేదు' అని పవన్ వ్యాఖ్యానించారు.