'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌

Pawan Kalyans Most Awaited Film Hari Hara Veera Mallu Released on May 9th
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' 
  • మే 9న సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌
  • ఈ మేర‌కు కొత్త పోస్ట‌ర్ విడుద‌ల‌
  • ఈ పోస్ట‌ర్ ద్వారా ఫ్యాన్స్‌కి, ప్రేక్ష‌కుల‌కు హోలీ విషెస్ తెలిపిన మేక‌ర్స్
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' సినిమా నుంచి హోలీ పండుగ సంద‌ర్భంగా మేక‌ర్స్‌ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ప్ర‌త్యేక పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన నిర్మాణ సంస్థ మే 9న సినిమాను రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

ఇక తాజాగా విడుద‌లైన కొత్త పోస్ట‌ర్‌లో ప‌వ‌న్‌తో పాటు క‌థానాయిక నిధి అగ‌ర్వాల్ కూడా గుర్ర‌పు స్వారీ చేస్తూ క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ద్వారా మేక‌ర్స్ ప‌వ‌న్ అభిమానుల‌కు, సినీ ప్రేక్ష‌కుల‌కు హోలీ విషెస్ తెలియ‌జేశారు. కాగా, ఇంత‌కుముందు మార్చి 28న ఈ సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ తేదీని మార్చారు. విడుద‌ల తేదీని మే 9కి వాయిదా వేశారు.  

ఆస్కార్ అవార్డు విజేత ఎంఎం కీర‌వాణి బాణీలు అందిస్తున్న ఈ మూవీకి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్ష‌న్స్ ప‌తాకంపై ఎ. ద‌యాక‌ర్‌రావు నిర్మిస్తున్న‌ ఈ చిత్రాన్ని 17వ శతాబ్దంలో సాగే క‌థ నేపథ్యంలో రెండు భాగాలుగా తీసుకురానున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా... బాలీవుడ్ న‌టుడు బాబీ డియోల్, న‌ర్గీస్ ఫ‌క్రీ, నోరా ఫతేహి, సునీల్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 
Go Back to Shorts
Hari Hara Veera Mallu
Pawan Kalyan
Tollywood

More Telugu News