Jethwani: సినీ నటి జెత్వానీ కేసు... ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

3 IPS officers suspension extended

  • జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు
  • ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ
  • సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు

ముంబై నటి కాదంబరీ జెత్వానీని అరెస్ట్ చేసి, ఇబ్బందులు పెట్టిన వ్యవహారంలో ఏపీకి చెందిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం మరో 6 నెలల పాటు పొడిగించింది. 

ఈ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ కాంతిరాణా తాతా, ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీని ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వారి సస్పెన్షన్ గడువు ముగియడంతో... సస్పెన్షన్ ను సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

ఈ ముగ్గురు ఐపీఎస్ లు అఖిల భారత సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాలపై రివ్యూ కమిటీ సిఫారసు తర్వాత సస్పెన్షన్ ను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News