Sai Pallavi: సోదరుడి పెళ్లి వేడుకలో చిందేసిన సినీ నటి సాయిపల్లవి

Sai Pallavi dances in brother Marriage
  • నీలం రంగు చీర ధరించి డ్యాన్సు చేసిన సాయిపల్లవి
  • నెట్టింట సాయిపల్లవి డ్యాన్సు వీడియోలు వైరల్
  • గతంలోనూ వివాహ వేడుకల్లో డ్యాన్స్ చేసిన సాయిపల్లవి
ప్రముఖ సినీ నటి సాయిపల్లవి తన సోదరుడి పెళ్లి వేడుకలో డ్యాన్సుతో అలరించారు. నీలం రంగు చీర ధరించిన సాయిపల్లవి చిందేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే, ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగిందనే వివరాలు రాలేదు. 

సాయిపల్లవి తన కుటుంబ సభ్యుల వివాహ వేడుకల్లో గతంలోనూ డ్యాన్సు చేశారు. గతంలో తన సోదరి వివాహం సమయంలో అన్నీ దగ్గరుండి చూసుకున్నారు. మెహందీ, పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్సు చేశారు. అప్పుడు కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.
Sai Pallavi
Tollywood

More Telugu News