Dragon: 'డ్రాగన్'కి తగ్గని వసూళ్లు... అందుకే ఓటీటీకి లేట్?

- తెలుగు .. తమిళ భాషల్లో విడుదల
- 120 కోట్లకు పైగా వసూళ్లు
- ఇంకా తగ్గని జోరు
- ఈ నెల చివరి నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్
ప్రదీప్ రంగనాథన్, కయాదు లోహర్, అనుపమ పరమేశ్వరన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' సినిమా ఫిబ్రవరి 21వ తేదీన విడుదలైంది. తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లకు వచ్చిన ఈ సినిమాకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. కామెడీ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకి లియోన్ జేమ్స్ సంగీతాన్ని అందించాడు.
పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 35 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించారు. అయితే ఇంతవరకూ ఈ సినిమా 120 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్టుగా తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో ఈ సినిమా ఇంకా తన జోరు చూపుతోందని అంటున్నారు. ఈ కారణంగానే, ముందుగా ఈ నెల 21వ తేదీన స్ట్రీమింగ్ చేయాలనుకున్న నెట్ ఫ్లిక్స్, ఈ నెల 28కి వాయిదా వేసుకున్నట్టుగా చెబుతున్నారు.
కథగా చెప్పుకోవాలంటే... హీరో ఒక కాలేజ్ లో ఇంటర్ చదువుతూ ఉంటాడు. అప్పటి నుంచే అతను లవ్ లో పడతాడు. ఫలితంగా ఆయన చదువు దెబ్బతింటుంది. తిరిగి అతను దార్లోపడటానికి చాలా సమయం పడుతుంది. ఆ తరువాత అతను లైఫ్ లో సక్సెస్ అవుతాడు. గతంలో అతని లైఫ్ నుంచి తప్పుకున్న వారు ఆ సమయంలో ఏంట్రీ ఇస్తారు. అప్పుడు ఏం జరిగింది అనేది కథ.