Durai Murugan: ఏపీ మహిళలపై తమిళనాడు మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Tamil Nadu minister Durai Murugan says Andhra And Bihar women still donot have educational rights
  • ఏపీ, బీహార్ మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదన్న మంత్రి దొరై మురుగన్
  • తందై పెరియార్ పోరాటాల వల్ల తమిళనాడు మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందన్న మంత్రి
  • మహిళా దినోత్సవం సందర్భంగా వ్యాఖ్యలు
తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి దురై మురుగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఏపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదని పేర్కొన్నారు. కానీ, తమిళనాడులో తందై పెరియార్ పోరాటాల ఫలితంగా మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందని చెప్పారు. ఆ కారణంగా రాష్ట్రంలో మహిళలు పురోగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

తమిళనాడు, కేరళలో మహిళల విద్యకు తందై పెరియార్ పోరాటాలు చేసి మార్గదర్శిగా నిలిచారని, రాష్ట్రంలో తొలి వైద్యురాలిగా మత్తులక్ష్మీరెడ్డి రికార్డులకెక్కారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు మహిళలకు విద్యాహక్కు లేదని మంత్రి దొరై మురుగన్ వ్యాఖ్యానించారు.
Durai Murugan
Tamil Nadu
Andhra Pradesh
Bihar
Educational Rights

More Telugu News