Pawan Kalyan: కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan congratulates Team India for winning ICC Champions Trophy
  • ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాదే కప్
  • ఫైనల్లో న్యూజిలాండ్ చిత్తు
  • టీమిండియాపై ప్రశంసల వర్షం 
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఛాంపియన్ గా అవతరించడంతో సర్వత్రా అభినందనల వర్షం కురుస్తోంది. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025ని గెలుచుకున్నందుకు కంగ్రాచ్యులేషన్స్ టీమిండియా అంటూ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు. 

ఈ టోర్నీ మొత్తం టీమిండియా ఆటతీరు అద్వితీయం అని అభివర్ణించారు. అన్ని రంగాల్లోనూ టీమిండియా నైపుణ్యం ప్రదర్శించిందని కొనియాడారు. టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టైటిల్ సాధించడం జట్టు అంకితభావానికి, ప్రతిభకు గీటురాయి అని పవన్ పేర్కొన్నారు. మున్ముందు ఇదే రీతిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
Pawan Kalyan
Team India
ICC Champions Trophy

More Telugu News