Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విష్ణు షేర్ చేసిన 'కన్నప్ప' మేకింగ్ వీడియో ఇదిగో!

Manchu Vishnu shares Kannappa making video
Advertisement
  • మంచు విష్ణు ప్రధాన పాత్రలో కన్నప్ప
  • ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఎపిక్ మూవీ
  • ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన కన్నప్ప టీమ్
Advertisement
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ మూవీ 'కన్నప్ప' ఈ వేసవిలో ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణుతో పాటు మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి హేమాహేమీలు నటిస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో కన్నప్ప టీమ్ ప్రమోషన్స్ లో వేగం పెంచింది. 

తాజాగా, మంచు విష్ణు కన్నప్ప మేకింగ్ వీడియో పంచుకున్నారు. తాము ఈ సినిమా కోసం ఎంత అధ్యయనం చేశామో, ఎన్ని డిస్కషన్లు జరిపామో, ఎంత హార్డ్ వర్క్ చేశామో ఈ వీడియో ద్వారా విష్ణు వివరించారు. దర్శకుడితో కలిసి తాను 24 క్రాఫ్ట్స్ తో ఎలా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లిందీ ఈ వీడియో ద్వారా వెల్లడించారు.

కన్నప్ప చిత్రం అవా ఎంటర్టయిన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బానర్లపై మహాభారత్ ఫేమ్ ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది.
Advertisement
Advertisement
Kannappa
Manchu Vishnu
Making Video

More Telugu News