భారత జట్టు విజయం కోసం గణపురం గ్రామస్థుల ప్రార్థనలు... వీడియో ఇదిగో!
-
గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. శివలింగాన్ని త్రివర్ణ ప్రతాక రూపంలో అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారత ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఈ సందర్భంగా స్వామి వారిని కోరుకున్నట్లు పూజారి తెలిపారు.