ఎమ్మెల్యే కోటంరెడ్డికి నారా లోకేశ్ అభినందనలు

--
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఆదివారం అభినందించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషిని ప్రశంసించారు. నియోజకవర్గంలో ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారని మెచ్చుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని లోకేశ్ పేర్కొన్నారు.

ఈమేరకు మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వివరాలను ప్రజలతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతనిస్తుందని చెప్పడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. తోటి ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పూర్తిగా నిలిచారని నారా లోకేశ్ కొనియాడారు.





More Telugu News