Ramprasd Reddy: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణకు ₹27.48కోట్ల నిధులు కేటాయించండి:కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి వినతి

State Minister Ramprasad Reddy requests Union Minister on Allocate 27 48 crore for the modernization of Indira Gandhi Municipal Stadium
  • హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన చింతన్ శివిర్ సమావేశం పాల్గొన్న ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి 
  • ఖేలో ఇండియా పథకం ద్వారా పలు ప్రాజెక్టులకు క్రీడా మౌలిక సదుపాయాలు కల్పనకు వినతి
  • రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుండి రూ.42.62 కోట్లకు విజ్ఞప్తి
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆధునీకరణకు రూ.27.48 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఏపీ క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో ఏర్పాటు చేసిన చింతన్ శివిర్ సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా పథకం ద్వారా పలు ప్రాజెక్టులకు క్రీడా మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. అలాగే, రాయచోటిలో క్రీడా సముదాయ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.42.62 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సహకారం అందించాలని కోరినట్లు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే నూతన క్రీడా పాలసీ, క్రీడా యాప్ ఆవిష్కరించడం జరిగిందని, ఇటీవల విశాఖలో దివ్యాంగుల స్పోర్ట్స్ సెంటర్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించినందుకు కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడలలో సుపరిపాలన, క్రీడల అభివృద్ధి, క్రీడా మౌలిక సదుపాయాలు, కార్పొరేట్‌లతో భాగస్వామ్యం వంటి అంశాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. 
Ramprasd Reddy
Andhra Pradesh
Indira Gandhi Municipal Stadium

More Telugu News