Ranganna: వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షి రంగన్న మృతదేహానికి రీ పోస్టుమార్టం

Re postmortem to Ranganna deadbody
  • రంగన్న మృతిపై ఆయన భార్య సహా పలువురి అనుమానాలు
  • ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల సమక్షంలో రీపోస్టుమార్టం
  • భాకరాపురం శ్మశానవాటికలో రీపోస్టుమార్టం
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతదేహానికి రీపోస్టుమార్టం చేశారు. పులివెందుల భాకరాపురం శ్మశానవాటికలో దీనిని నిర్వహించారు. మంగళగిరి, తిరుపతి ఫోరెన్సిక్ నిపుణులు, వైద్యుల ఆధ్వర్యంలో రీపోస్టుమార్టం జరిగింది. తన భర్త మృతిపై అనుమానాలున్నాయని రంగయ్య భార్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సందేహాల నివృత్తి కోసం మరోసారి పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహంపై గాయాలు ఉన్నాయా? లేవా? అనే అంశాన్ని పరిశీలించారు.
Ranganna
Re postmortem

More Telugu News