Old Woman: వీల్ చెయిర్ ఇవ్వలేదు, కిందపడితే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు: ఎయిర్ ఇండియాను ఏకిపారేసిన యువతి
- ఢిల్లీ విమానాశ్రయంలో తన బామ్మకు ఎదురైన ఇబ్బందులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువతి
- టికెట్ బుక్ చేసే సమయంలోనే వీల్ చెయిర్ కోసం రిక్వెస్ట్ చేశామని వివరణ
- గంటపాటు ఎదురుచూసినా వీల్ చెయిర్ తీసుకురాలేదని ఆరోపణ
ఢిల్లీ విమానాశ్రయంలో 82 ఏళ్ల మహిళ కిందపడి గాయాలపాలైంది. కిందపడ్డ ఆ వృద్ధురాలికి ఎవరూ సాయం చేయలేదని, పెదవి చిట్లి రక్తమోడుతున్నా ఫస్ట్ ఎయిడ్ చేయలేదని ఆ పెద్దావిడ మనుమరాలు ఆరోపించింది. ఎయిర్ ఇండియా సిబ్బంది తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడింది. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా విమానానికి టికెట్ బుక్ చేసుకున్న తమకు ఎదురైన అనుభవాన్ని ఆ యువతి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఢిల్లీకి చెందిన పారుల్ కన్వర్, తన బామ్మ రాజ్ పశ్రీచ (82) తో కలిసి ఇటీవల బెంగళూరు వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్ ఇండియా ఫ్లైట్ కు టికెట్ బుక్ చేసుకున్నపుడే వీల్ చెయిర్ కావాలని ఆప్షన్ ఎంచుకుంది. ఆమేరకు టికెట్ పై వీల్ చెయిర్ రిక్వెస్ట్ ను అంగీకరించినట్లు ప్రింట్ కూడా అయింది. అయితే, ఎయిర్ పోర్ట్ లో ఎయిర్ ఇండియా సిబ్బంది ఎంతకూ వీల్ చెయిర్ అందించలేదని, పదే పదే రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదని ఆరోపించింది. చేసేదేమీ లేక తన బామ్మతో కలిసి నెమ్మదిగా బోర్డింగ్ వైపు నడుస్తుండగా.. తన బామ్మ తూలి కిందపడిందని, పెదవికి, తలకు గాయాలయ్యాయని పేర్కొంది.
బామ్మను పైకి లేపేందుకు తాను ఒక్కదాన్ని అవస్థ పడుతున్నా అక్కడే ఉన్న ఎయిర్ ఇండియా సిబ్బంది సాయం చేయలేదని మండిపడింది. అప్పుడు వీల్ చెయిర్ తెచ్చిచ్చారని, గాయం కారణంగా బామ్మ రక్తమోడుతున్నా ఫస్ట్ ఎయిడ్ చేయకుండా వదిలేశారని ఆరోపించింది. విమానంలో ఎయిర్ హోస్టెస్ లు ఐస్ ప్యాక్ తో ఫస్ట్ ఎయిడ్ చేసి బెంగళూరు విమానాశ్రయం అధికారులకు సమాచారం అందించారని, విమానం దిగగానే తన బామ్మకు ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించారని పారుల్ కన్వర్ వివరించింది.
ఈ గాయం, వయసు కారణంగా తన బామ్మను వైద్యులు రెండు రోజుల పాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారని తెలిపింది. బ్రెయిన్ లో రక్తస్రావం జరిగి ఉండొచ్చని వైద్యులు సందేహం వ్యక్తం చేశారని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎయిర్ ఇండియా సిబ్బంది తీరుపై తీవ్రంగా మండిపడుతూ సోషల్ మీడియాలో పారుల్ కన్వర్ పోస్ట్ పెట్టింది. దీనిపై ఎయిర్ ఇండియా స్పందించి జరిగిన ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపింది.