Nara Lokesh: నిమ్మల అనారోగ్యం అంశాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించిన మంత్రి లోకేశ్

Lokesh mentions in assembly that minister Nimmala suffering with fever
  • జ్వరంతో బాధపడుతున్న మంత్రి నిమ్మల
  • చేతికి ఇంజక్షన్ కేనలాతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు 
  • విశ్రాంతి తీసుకుంటేనే బాగుంటుందన్న లోకేశ్, విష్ణుకుమార్ రాజు
మంత్రి నిమ్మల రామానాయుడు జ్వరంతో బాధపడుతూనే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుండడం పట్ల నారా లోకేశ్ స్పందించారు. ఇప్పటికే లాబీలో కలిసినప్పుడు, వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని నిమ్మలకు లోకేశ్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలు అయిపోయాక విశ్రాంతి తీసుకుంటానని నిమ్మల బదులిచ్చారు. ఇదే అంశాన్ని లోకేశ్ అసెంబ్లీలోనూ ప్రస్తావించారు. 

డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చైర్ లో ఉన్న సమయంలో లోకేశ్ మాట్లాడుతూ...  అధ్యక్షా... మంత్రి నిమ్మల గారు అనారోగ్యంతో బాధపడుతున్నారు... ఆయననువిశ్రాంతి తీసుకోమని చెబితే వినిపించుకోవడం లేదు... మీరు రూలింగ్ ఇస్తేనైనా ఆయన విశ్రాంతి తీసుకుంటారేమో అధ్యక్షా. రెండ్రోజులు విశ్రాంతి తీసుకుని కోలుకున్నాకే సభకు రండి అని చెప్పాను... ఆయన పట్టించుకోవడంలేదు... మీరైనా చెప్పండి అధ్యక్షా. ఇది నిజంగా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం" అని లోకేశ్ పేర్కొన్నారు. 

అటు... బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. జ్వరం వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకోకుండా సభకు రావడం సబబు కాదు అధ్యక్షా... మీరు రూలింగ్ ఇచ్చి మా అందరి తరఫున నిమ్మలకు విన్నవించాలి అని పేర్కొన్నారు. కాగా, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మంత్రి నిమ్మలను ఉద్దేశించి 'పని రాక్షసుడు' అని అభివర్ణించారు.
Nara Lokesh
Nimmala Rama Naidu
Fever
AP Assembly Session

More Telugu News