Kalpana: గాయని కల్పన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల మీడియా సమావేశం

Doctors press conference on Kalpana health condition

  • కల్పన వేగంగా కోలుకుంటున్నారన్న హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు
  • కల్పన అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడి
  • కల్పనను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారన్న వైద్యులు

ప్రముఖ గాయని కల్పన ఆరోగ్య పరిస్థితిపై హోలిస్టిక్ ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశం నిర్వహించారు. కల్పన త్వరితగతిన కోలుకుంటున్నట్లు వెల్లడించారు. కల్పన అపస్మారకస్థితిలో ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేస్తామన్నారు.

కల్పనను సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చారని తెలిపారు. ఇక్కడకు తీసుకువచ్చినప్పుడు ఆమె స్పృహలో లేరని, వెంటనే చికిత్స అందించడం వల్ల ఆమె వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా ఇన్‌ఫెక్షన్ ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఆక్సిజన్ సిలిండర్లు తొలగించినట్లు తెలిపారు. శ్వాస తీసుకోగలుగుతున్నారని, భోజనం కూడా తీసుకుంటున్నారని వివరించారు.

  • Loading...

More Telugu News