Nirmala Sitharaman: భారత్‌పై విధిస్తున్న సుంకాల మీద చర్చించేందుకు గోయల్ అమెరికా వెళ్లారు: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman says will have to watch trade talks with US
  • అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖతో గోయల్ చర్చిస్తున్నారన్న నిర్మలా సీతారామన్
  • భారత్ ఎగుమతులను దృష్టిలో పెట్టుకొని చర్చలు జరుపుతున్నట్లు వెల్లడి
  • మనం వినియోగించుకునే వాటికే పన్నులు చెల్లిస్తామన్న ఆర్థికమంత్రి
భారత్‌పై అమెరికా విధిస్తున్న సుంకాల అంశం మీద చర్చించేందుకు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్లారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అమెరికా వాణిజ్య మంత్రిత్వ శాఖతో ఆయన చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. భారత్ ఎగుమతులను దృష్టిలో ఉంచుకొని చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు.

వ్యాపారవేత్తలు, చార్టెడ్ అకౌంటెంట్లు, న్యాయవాదులు, వివిధ సంఘాల నుండి సలహాలు, సూచనలను తీసుకొని బడ్జెట్‌లో మార్పులు చేర్పులు చేస్తామని స్పష్టం చేశారు. బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత గడువు ఉంటుందని, పార్లమెంటు తిరిగి ప్రారంభమయ్యాక ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరుగుతుందని గుర్తుచేశారు. ఆ తర్వాతే ఆమోదస్తామని తెలిపారు. అవసరమైన అభిప్రాయాలు, సూచనలు వస్తే సవరణలు చేసి ఆమోదిస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం రోడ్లు, ఆసుపత్రులు, విమానాశ్రయాలను నిర్మిస్తోందని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక్కో ఇంటికి తాగు నీరు అందిస్తున్నట్లు వెల్లడించారు. మనం ఉపయోగించుకునే వాటికే పన్నులు చెల్లిస్తామని తెలిపారు. కారును కొనుగోలు చేసిన వారే పన్నులు చెల్లిస్తారని, కొనుగోలు చేయని వారు పన్ను చెల్లించరని తెలిపారు. రోడ్డును వినియోగించుకున్న వారే టోల్ ట్యాక్స్ చెల్లిస్తారని తెలిపారు. ఉపయోగించుకునే వాటికి పన్నులు చెల్లిస్తేనే రోడ్లు నిర్మించగలమని అన్నారు.
Nirmala Sitharaman
Telangana
USA
BJP

More Telugu News