Tamannaah: తమన్నా, విజయ్ వర్మ బ్రేకప్ కు కారణం ఇదేనా?

- 'లస్ట్ స్టోరీస్' చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడ్డ తమన్నా, విజయ్
- పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలనుకున్న తమన్నా
- ఇప్పుడే పెళ్లి వద్దన్న విజయ్ వర్మ
మిల్కీ బ్యూటీ తమన్నా, నటుడు విజయ్ వర్మ చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. 2023లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లస్ట్ స్టోరీస్' సూపర్ హిట్ అయింది. ఈ సిరీస్ చిత్రీకరణ సమయంలో ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత తమ లవ్ మ్యాటర్ ను ఈ జంట వెల్లడించింది.
ఓ సందర్భంలో తమన్నా మాట్లాడుతూ... తాను ఓ అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నానని, ఆ ప్రపంచంలోకి విజయ్ వర్మ వచ్చాడని తెలిపింది. 35 ఏళ్ల వయసులో ఉన్న తమన్నా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ కావాలని కోరుకుందని... అయితే విజయ్ వర్మ మాత్రం ఇప్పుడే పెళ్లి వద్దనుకున్నాడని, కెరీర్ పై దృష్టి సారించాలనుకున్నాడని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని సమాచారం. దీంతో, ఇద్దరూ విడిపోయారని బీటౌన్ లో టాక్ నడుస్తోంది.