Telangana: తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే..!

Telangana Govt Releases Orders Regarding Summer Holidays For Schools
  • ఎండలు ముదరడంతో ఒంటిపూట బడులు
  • ఈ నెల 15 నుంచి ప్రారంభం.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు
  • ఏప్రిల్ 20 నుంచి వేసవి సెలవులు
తెలంగాణలో ఎండలు మండిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15 నుంచే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఒంటిపూట నిర్వహించాలని సూచించింది. ఈమేరకు స్కూల్ యాజమాన్యాలు, ప్రిన్సిపాల్స్ కు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12:30 గంటలకు క్లోజ్ చేయాలని ఆదేశించింది.

అదేవిధంగా, రాష్ట్రంలోని స్కూళ్లకు వచ్చే నెల (ఏప్రిల్) 20 నుంచి వేసవి సెలవులు ప్రకటిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూళ్లు మధ్యాహ్నం పూట క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. ఈమేరకు పాఠశాలల్లో ఏర్పాట్లు చేసుకోవాలంటూ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.
Telangana
Schools
Summer Holidays
Half Day
Holidays

More Telugu News