'ఛావా' చిత్రాన్ని వీక్షించిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్

  • శంభాజీ ధైర్య సాహసాలను కళ్లకు కట్టినట్లు చూపించారన్న ఫడ్నవీస్
  • శంభాజీ జీవిత చరిత్రను చరిత్రకారులు పట్టించుకోలేదని వ్యాఖ్య
  • 'ఛావా' అద్భుతమైన సినిమా అంటూ కితాబు
ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ ధైర్య సాహసాలను 'ఛావా' చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొనియాడారు. శంభాజీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'ఛావా' చిత్రాన్ని ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వీక్షించారు.

అనంతరం మాట్లాడుతూ, శంభాజీ  జీవిత చరిత్రను చరిత్రకారులు సరిగ్గా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. యోధుల చరిత్రపై తెరకెక్కించిన ఈ చిత్రం నేటి తరానికి ఎంతో అవగాహన కల్పిస్తుందన్నారు. ఇది అద్భుతమైన చిత్రమని అన్నారు.

ఔరంగజేబును ప్రశంసించిన ఎమ్మెల్యేపై సమాజ్‌వాది చర్యలు తీసుకోవాలి: యోగి ఆదిత్యనాథ్

ఔరంగజేబును ప్రశంసించిన మహారాష్ట్రకు చెందిన సమాజ్‌వాది పార్టీ ఎమ్మెల్యే అబు అసీమ్ నజ్మీపై ఆ పార్టీ అధినాయకత్వం చర్యలు తీసుకోవాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు.

ఆయనపై సమాజ్‌వాది పార్టీ అధినాయకత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు. యోగి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడారు. ఔరంగజేబు... తండ్రి షాజహాన్‌ను ఆగ్రా కోటలో బంధించి కనీసం నీరు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురిచేశాడని వెల్లడించారు.


More Telugu News