జనసేన ఒక అవినీతి, కుటుంబ పార్టీ... ఎమ్మెల్సీని పవన్ తన అన్నకు ఇచ్చుకున్నాడు: కేఏ పాల్

  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ జనసేన అభ్యర్థిగా నాగబాబు
  • ఖరారు చేసిన పవన్ కల్యాణ్
  • పవన్ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించిన కేఏ పాల్
జనసేన నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరును పవన్ కల్యాణ్ ఖరారు చేయడం తెలిసిందే. దీనిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించారు. పవన్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 

"పవన్ కల్యాణ్ ఏమన్నాడు... జనసేన పెట్టింది ప్రజల కొరకే... ప్రజలకు న్యాయం జరగడం కొరకే.... ప్రజల కోసం పోరాటం చేసేందుకే అన్నాడు. అవినీతిపరుడు అని మీకు చెప్పాను కదా. 21 మంది ఎమ్మెల్యేల తరఫున ఒక ఎమ్మెల్సీ సీటు ఉంది... పార్టీ కోసం కష్టపడిన లక్షల మంది ఉంటే వారికేమైనా ఇస్తున్నాడా? కోట్ల రూపాయలు ఖర్చుపెట్టిన నాయకులకేమైనా ఇస్తున్నాడా? 

ఇది కేవలం అవినీతి, కుటుంబ పార్టీ అని చెప్పాను... ఇప్పుడు వాళ్ల అన్న అయిన నాగబాబుకు, అది కూడా హైదరాబాదులో ఉన్న యాక్టర్ ను తీసుకువచ్చి మనల్ని అందరినీ తాకట్టు పెడుతున్నాడు. 

జనసైనికులారా... ఆయన మారడు, మీరు మారొద్దా... బయటికి రండి... ప్రజాశాంతి పార్టీలో చేరండి... ఈ కుటుంబ, కుల, అవినీతి, అగ్రవర్ణ పార్టీకి గుడ్ బై చెబుదాం" అంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు.


More Telugu News